పాకిస్థాన్ గడ్డపై ‘రామాయణం’ ప్రదర్శన.. డైరెక్టర్ ఏమన్నారంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-14 05:37:01  IST  )

కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రామాయణ గాథ పాకిస్థాన్ గడ్డపై ప్రదర్శింపబడుతోంది.

పాకిస్థాన్ గడ్డపై ‘రామాయణం’ ప్రదర్శన.. డైరెక్టర్ ఏమన్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రామాయణ గాథ పాకిస్థాన్ గడ్డపై ప్రదర్శింపబడుతోంది. పాక్‌లో ఇటీవల మూడు రోజల పాటు ప్రదర్శించిన ‘రామాయణ నాటక ప్రదర్శన’ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు అందుకుంటుంది. అయితే.. ఇందులోని కళాకారులు పాకిస్థానీయులే కావడం గమనార్హం. కరాచీకి చెందిన స్థానిక నాటక బృందం ‘మౌజ్’ సాంస్కృతిక సరిహద్దులను దాటి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రాముడు, సీత, రావణుడు వంటి కీలక పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. వీరి నటనను చూసిన స్థానికులు చప్పట్లతో ప్రోత్సహిస్తున్నారు.

ఈ క్రమంలో మొదటిసారిగా ఈ నాటకాన్ని కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్థాన్‌లో ప్రదర్శించారు. ఈ నాటక బృందం రామాయణం సారాంశాన్ని గౌరవిస్తూనే స్థానిక సాంస్కృతిక సందర్భాలకు అనుగుణంగా కొన్ని సవరణలు చేసింది. సంగీతం, దుస్తుల విషయంలో పాకిస్థానీ శైలిని అనుసరించింది. కానీ.. రామాయణం మూల కథను, దాని నీతి సందేశాలలో మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా వేదిక పై ప్రదర్శించారు.

నాటక దర్శకుడు మాట్లాడుతూ.. ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే స్థానికంగా విమర్శలు, బెదిరింపులు ఎదురవుతాయని భావించలేదని డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా తెలిపారు. ఈ నాటకానికి ఆదరణతో పాటు నటీనటుల కృషికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘రామాయణం ఒక సార్వత్రిక కథ. కథలు సరిహద్దులు దాటి మనుషులను ఒక్కటిగా చేస్తాయని’ నాటక నిర్మాత అన్నారు. దీనిని పాకిస్థానీ ప్రేక్షకులకు సాంస్కృతిక వారధిగా ఉపయోగించాలని భావించాము అని తెలిపారు. ఈ నాటకానికి మంచి ఆదరణ రావడంతో పాటు పాక్ నాటక రంగంలోనే మైలురాయిగా నిలిచింది.

Link

Next Story