- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Airbus Home: వాట్ యాన్ ఐడియా.. పాత ఎయిర్ బస్.. ఏ-320తో లగ్జరీ ఇల్లు వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో: ఇల్లు కట్టుకోవడం అనేది జీవితంలో చాలా మందికి పెద్ద లక్ష్యం. మధ్యతరగతి నుంచి ధనవంతుల వరకు సొంతింటి కల సాకారానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అయితే కొంత మంది ఇల్లు కట్టుకోవడంలో అందరికంటే భిన్నంగా ఉంటారు. బస్సులు, పెద్ద కంటైనర్లు, పాత రైలు బోగీలను రెస్టారెంట్లుగా, విలాసవంతమైన ఇల్లుగా మార్చుకుంటారు. వారి అభిరుచి మేరకు వాటిని ఇల్లుగా మార్చేసి ఫ్యామిలీతో హాయిగా కాపురం పెట్టిన ఘటనలు ఎన్నో చూశాము. ఈ క్రమంలోనే ఎయిర్ బస్.. ఏ-320 (Airbus A-320) పాత విమానాన్ని కొనేసి ఇంటి కింద మార్చేసుకున్నారు. ఈ ఎయిర్ బస్సులో కిచెన్ రూమ్, బెడ్ రూమ్, ఆఫీస్ రూమ్, బేడీ కాట్, బాత్రూమ్, మాస్టర్ బెడ్ రూమ్ ఉన్నాయి. విలాసవంతమైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఉండాల్సిన సదుపాయాలు అన్ని ఈ ఇంట్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వాట్‌యాన్ ఐడియా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ పాత విమానం కొని ఇల్లు నిర్మించుకునే బదులు.. అదే డబ్బులతో మంచి డ్రీమ్ హౌస్ పెద్దది కట్టుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక, వైరల్ అయిన వీడియో యూకేకు చెందిన applecamping.co.uk వారు వైరటీగా రకరకాల ఆకృతులతో ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్ బస్, ట్రైన్, యూఎఫ్‌ఓ, ప్రైవేటు జెట్, విచ్ హట్ లాంటి వివిధ రకాల ఆకారాల్లో ఇండ్లను నిర్మించారు. వీరు ఒక ఫామ్‌లో ఇవ్వనీ ఏర్పాటు చేసి బుకింగ్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.