- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా సాయం లేకుండానే ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసం చేస్తాం: ఇజ్రాయిల్
ఇరాన్ ఇజ్రాయిల్ నేపథ్యంలో అమెరికా సాయం లేకుండానే తాము పూర్తిగా అణు స్థావరాలను ధ్వంసం చేయగలమని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ఇజ్రాయిల్ నేపథ్యంలో అమెరికా సాయం లేకుండానే తాము పూర్తిగా అణు స్థావరాలను ధ్వంసం చేయగలమని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు చేసిన దాడుల్లో అమెరికా సాయం తీసుకోలేదని ప్రకటించారు. కాగా ఇరాన్ తో పోరులో అమెరికా కలిసి వస్తుందా రాదా అనేది వారి నిర్ణయమని అన్నారు. పోర్డ్ లోని అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని తేల్చి చెప్పారు. ఏ మాత్రం ఇరాన్ పై దాడుల విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో అమెరికా ఖతార్ ఎయిర్ బేస్ లో ఉన్న 40 మిలిటరీ యుద్ధ విమానాలను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇరాన్ కు ఖతార్ ఎయిర్ బేస్ దగ్గరలో ఉంటుంది. కాగా రెండు వారాల్లో ఇరాన్ అణు ఒప్పందానికి రెడీ కాకపోతే యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కాగా ఈ నేపథ్యంలోనే ఖతార్ లో ఉన్న యుద్ధ విమానాల్ని అమెరికా తరలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలుపుతోంది.
40 మిలటరీ విమానాలు రహస్య ప్రాంతాలకు తరలింపు
జూన్ 5న ప్లానెట్ ల్యాబ్స్ (PBC) ఉపగ్రహ చిత్రాలు అల్ ఉదీద్ ఎయిర్ బేస్ వద్ద దాదాపు 40 సైనిక విమానాలను చూపించగా జూన్ 19న విడుదల చేసిన చిత్రంలో మూడు విమానాలు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొంది. అక్కడ విమానాలను హ్యంగర్ లలోకి తరలించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల్లో యూఎస్ రాయబార కార్యాలయం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అక్కడి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఖతార్ లోని యూఎస్ లక్ష్యాలను ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొంది.






