- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
plane crash: విమాన ప్రమాదంలో సమగ్ర విచారణకు సహకరిస్తాం: ఎయిరిండియా
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో పూర్తిగా విధ్వంసం కాగా తోక భాగం హాస్టల్ భవనంపై అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం శిథిలాల తొలగింపు చేస్తున్న సమయంలో ఆ విమానం తోక భాగంలో మరో మృతదేహం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. ఈ మృతదేహం విమానంలో పనిచేసే ఒక ఎయిర్ హోస్టేస్ ది గుర్తించారు. విమాన ప్రమాదం జరిగే సమయంలో పైలెట్ మేడే మేడే మేడే అని అన్నట్లు, దీంతో పాటు నో పవర్ నో థ్రస్ట్ అని ఆయన అన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. విమానం కిందికి వెళ్ళిపోతుంది ఏదైనా సాయం చేయండి అంటూ ఫైలెట్ చెప్పడం దీని అర్థం అని నిపుణులు తెలుపుతున్నారు.
ఎయిరిండియా కఠిన నిర్ణయాలు
అహ్మాదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుండగా.. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎయిరిండియా బోర్డు కఠిన నిర్ణయాలకు రెడీ అయింది. విమానాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిణతో పాటు... విమానాల కండీషన్, నిర్వహణ పద్ధతులు, ఉద్యోగుల పనితీరు, క్రమశిక్షణ తదితర విషయాలతో పాటు ఆడిట్ నిర్వహణకు ఎయిరిండియా ఛైర్మన్, సీఈవో సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ప్రమాదంలో పూర్తిస్థాయిలో విచారణకు సహకరిస్తామని ఎయిరిండియా వెల్లడించింది.






