- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ లో బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీ కేంద్రాలను పేల్చేశాం: ఇజ్రాయిల్
ఇజ్రాయిల్ ఇరాన్ పై మరోసారి మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఇరాన్ లోని బాలిస్టిక్ మిస్సైళ్లనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్ ఇరాన్ పై మరోసారి మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఇరాన్ లోని బాలిస్టిక్ మిస్సైళ్లనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (Israel Defense Forces) ఐడీఎఫ్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఇరాన్ లోని కెర్మాన్ షా ప్రాంతంలో ఈ ఉదయం 15 యుద్ధ విమానాలతో బాలిస్టిక్ మిస్సైళ్ల స్థావరాలపై కచ్చితత్వంతో దాడులు చేశామని వివరించింది. ఈ దాడిలో ఆ ప్రాంతం మొత్తం ధ్వంసమైనట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ డ్రోన్ ను ఖోరామాబాద్ ప్రాంతంలో కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీన్ని ఐడీఎఫ్ కూడా అంగీకరించింది. అమెరికా ఇరాన్ పై చేసిన దాడులను ఇరాన్ నూతన సైనికాధ్యక్షుడు ఆమిర్ హతామీ ఖండించారు. అమెరికాకు కచ్చితంగా ధీటైన జవాబు ఇస్తామని హెచ్చరించారు.
ఇజ్రాయిల్ ప్రధాని కీలక ప్రకటన
రెండు దేశాలు పరస్పరం మిస్సైళ్ల దాడులు చేసుకుంటున్న వేళ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్ తో తాము యుద్ధం చేయబోమని అన్నారు. ‘ ఆపరేషన్ రైజింగ్ లయన్ ’ దాడులు చివరి దశకు చేరువైనట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా తమ లక్ష్యం ఇరాన్ లోని అణ్వస్త్ర కేంద్రాలను నేలమట్టం చేయడమే అని ప్రకటించారు. అయితే అమెరికా పోర్డ్, నతాంజ్ అణ్వస్త్ర కేంద్రాలను ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు బెంజిమన్ యుద్ధం చేయడం లేదని పేర్కొనడం విశేషం. ఇరాన్ మాత్రం అమెరికా చేసిన దాడులకు ప్రతిఫలం తప్పక అనుభవిస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైనిక పోస్టులపై దాడులకు ఇరాన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఇటు ఇజ్రాయిల్ లో ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.






