పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ ఆఫ్గ‌నిస్థాన్ మ‌ధ్య యుద్ద మేఘాలు క‌మ్ముకున్నాయి. రెండు దేశాలు ఒక‌దానిపై మ‌రొక‌టి బుల్లెట్ల వ‌ర్షం కురిపించుకుంటున్నాయి. పాకిస్థాన్ 7 పోస్టుల వెంబ‌డి ఆఫ్ఘ‌నిస్థాన్ భీక‌ర కాల్ప‌ల‌కు పాల్ప‌డుతోంది. పాక్ ఆర్మీ పోస్టులను సైతం తాలిబన్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఆఫ్ఘన్ ఢిఫెన్సీ మినిస్ట్రీ వెల్లడించింది.

పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఆఫ్గ‌నిస్థాన్ మ‌ధ్య యుద్ద మేఘాలు క‌మ్ముకున్నాయి. రెండు దేశాలు ఒక‌దానిపై మ‌రొక‌టి బుల్లెట్ల వ‌ర్షం కురిపించుకుంటున్నాయి. పాకిస్థాన్ 7 పోస్టుల వెంబ‌డి ఆఫ్ఘ‌నిస్థాన్ భీక‌ర కాల్ప‌ల‌కు పాల్ప‌డుతోంది. పాక్ ఆర్మీ పోస్టులను సైతం తాలిబన్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఆఫ్ఘన్ ఢిఫెన్సీ మినిస్ట్రీ వెల్లడించింది. తాలిబన్ల దాడులతో పాక్ సైనికులు పారిపోతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. త‌మ కాల్ప‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు పాకిస్థాన్ సైనికులు మ‌ర‌ణించార‌ని ఆఫ్ఘ‌నిస్థాన్ ప్ర‌క‌టించింది.

అంతే కాకుండా కౌంట‌ర్ ఫైరింగ్ లో ప‌లువురు ఆఫ్ఘ‌నిస్థాన్ సైనికులు చనిపోయార‌ని పాకిస్థాన్ చెబుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్ పై పాక్ వైమానిక దాడి త‌ర‌వాత ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. పాక్ ప‌దే ప‌దే ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతుడూ ఆఫ్గ‌న్ పై దాడుల‌కు పాల్ప‌డుతోంద‌ని దానికి బ‌దులుగానే విజ‌య‌వంత‌మైన ప్ర‌తీకార దాడులు చేశామ‌ని ఆఫ్ఘ‌న్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి ఎనాయ‌తుల్లా ఖ్వారిజ్మి వెల్ల‌డించారు. ఇక ఈ ఉద్రిక్త‌త‌త‌పై పాకిస్థాన్ వివాదాస్పద మంత్రి మెహ్సిన్ నఖ్వి స్పందిస్తూ.. ప్రతి ఇటుకకు ఒక రాయితో బదులిస్తామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాతావరణం చూస్తుంటే ఈ యుద్ధం కొనసాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story