అప్పుడు విజయ్ గెలవాలని ముఖానికి ఈటెలు.. ఇప్పడు ఆత్మహత్యాయత్నం.. ఇలా ఉన్నారేంట్రా బాబు

by Ajay Maddhiboyina |

టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం అరవసీరియల్ ను తలపిస్తోంది. కథ ముందుకు సాగకుండా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల అనంతరం రెండు రోజుల్లో ప్రమాణస్వీకారం ఉందని అనుకోగా గవర్నర్ మెజారిటీ లేదంటూ షాక్ ఇచ్చారు.

అప్పుడు విజయ్ గెలవాలని ముఖానికి ఈటెలు.. ఇప్పడు ఆత్మహత్యాయత్నం.. ఇలా ఉన్నారేంట్రా బాబు
X

దిశ, వెబ్ డెస్క్: టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం అరవసీరియల్ ను తలపిస్తోంది. కథ ముందుకు సాగకుండా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల అనంతరం రెండు రోజుల్లో ప్రమాణస్వీకారం ఉందని అనుకోగా గవర్నర్ మెజారిటీ లేదంటూ షాక్ ఇచ్చారు. తరవాత పొత్తుల కోసం ప్రయత్నిస్తే ఇతర పార్టీలు కండిషన్స్ పెడుతున్నాయి. దీంతో ఆ పొత్తులు కుదరగా విజయ్ ప్రమాణస్వీకారం సందిగ్దంగా మారింది. ఈ క్రమంలో ఆ టెన్షన్ తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సుమారు 40 ఏళ్ల వయసున్న ఇసక్కియప్పన్ శనివార తమ అభిమాన హీరో విజయ్ ప్రమాణస్వీకారం చేస్తాడని కలలు కన్నాడు.

కానీ తాను ఊహించినట్టుగా జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంట‌నే స్థానికులు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే వ్య‌క్తి గ‌తంలో విజ‌య్ సీఎం అవ్వాల‌ని త‌న ముఖానికి 16 పొడవైన ఈటెల‌ను గుచ్చుకున్న‌ట్టు స‌మాచారం. మొన్న కూడా ఓ అభిమాని విజ‌య్ ఎన్నిక‌ల్లో గెలుస్తాడో లేదో అని భ‌య‌ప‌డి ఫ‌లితాలు రాక‌ముందే ఆత్మ‌హ‌త్యం చేశాడు. ప్ర‌స్తుతం అత‌డు కూడా ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డంతో విజ‌య్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా బాబు అంటూ అంతా త‌ల‌లు పట్టుకుంటున్నారు.

Next Story