Viral video: కెనడా మెట్రోలో భిక్షాటన చేస్తున్న భారతీయ యువతి వీడియో వైరల్! నెటిజన్లలో చర్చ

by Ramesh Naini |

కెనడాలోని ఓ మెట్రో స్టేషన్‌లో భిక్షాటన చేస్తూ భారతీయ యువతి కెమెరాకు చిక్కింది.

Viral video: కెనడా మెట్రోలో భిక్షాటన చేస్తున్న భారతీయ యువతి వీడియో వైరల్!  నెటిజన్లలో చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కెనడాలోని (Canada metro) ఓ మెట్రో స్టేషన్‌లో (Indian girl begging) భిక్షాటన చేస్తూ భారతీయ యువతి కెమెరాకు చిక్కింది. సోషల్ మీడియాలో (Viral video) వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వీడియో ప్రకారం.. యువతి వయసు సుమారు 25-30 ఏళ్లకు పైగా ఉండొచ్చని నెటిజన్‌ల అంచనా. చేతిలో ఒక అట్ట ముక్క పట్టుకుని స్టేషన్‌లో కూర్చోని కన్పించింది. ఆమె ఇండియన్ అని గ్రహించిన ఓ వ్యక్తి చూసి వీడియో తీయడం మొదలు పెడతాడు. వెంటనే యువతి ముఖంపై అట్ట ముక్క పెట్టి ఫేస్ కవర్ చేస్తుంది. ఆ వ్యక్తి కంటిన్యూగా వీడియో తీయడంతో యువతి అక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అవుతుంది. @Sherovicisfire అనే ఎక్స్ యూజర్ ఈ వీడియో పోస్ట్ చేశారు. (Canadian Station) కెనడియన్ స్టేషన్‌లో భిక్షాటన చేస్తున్న భారత మహిళ కనిపించిందని వీడియో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్‌కు 2.3 మీలియన్ల వ్యూస్, 14 వేలకు పైగా లైక్ వచ్చాయి. ఈ ఘటనపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. భిక్షాటన చేయడానికి వీసా తీసుకోని వెళ్లిందని పలువురు నెటిజన్‌లు సెటైర్లు వేశారు. యువతి చేసిన పని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదని, డబ్బుల కోసం చెడ్డ పనులు చేసే బదులు.. ఇలా భిక్షాటన చేయడం మంచి మార్గమేనని, వీలైతే తనకు సహాయం చేయాలని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది.

ఈ ఘటనతో విదేశాల్లో భారతీయ విద్యార్థుల పరిస్థితిపై మళ్లీ చర్చకు దారితీసింది. విదేశాల్లో చదువుకోవడానికి లేదా ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు ఇలాంటి పరిస్థితులకు గురవ్వడం విచారకరమని పలువురు నెటిజన్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోడానికి వెళ్లిన కొందరు విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ దొరకక ఇబ్బందులు పడుతుండటంతో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. అయితే ఇక్కడ భిక్షాటన చేస్తున్నట్లు కన్పిస్తున్న యువతి నిజంగా విద్యార్థినేనా? లేక వేరే కారణాలతో భిక్షాటన చేస్తోందా? స్క్రిప్ట్ వీడియోనా..? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కొంత మంది నెటిజన్‌లు మాత్రం కావాలనే తీసిన ఫేక్ క్రియేటివ్ వీడియో అని కామెంట్‌లో తెలిపారు.

Next Story