లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

by Naga Rani Yarlagadda |

అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి జరుపుకుంటాం. ఈ వేడుకలకు ప్రపంచమంతా సిద్ధమవుతున్న వేళ.. ఆయన విగ్రహానికి లండన్లో దారుణ అవమానం జరిగింది.

లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి జరుపుకుంటాం. ఈ వేడుకలకు ప్రపంచమంతా సిద్ధమవుతున్న వేళ.. ఆయన విగ్రహానికి లండన్లో దారుణ అవమానం జరిగింది. టవిస్టాక్ స్క్వేర్ లో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ చర్యను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. సిగ్గుచేటైన చర్య అని, అహింసా సిద్ధాంతంపై జరిగిన దాడిగా పేర్కొంది.

గాంధీ విగ్రహం పీఠంపై.. భారత వ్యతిరేక రాతలు రాశాలు. అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి మూడ్రోజుల ముందు అహింసా వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి అని భారత్ వాపోయింది. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న దౌత్యవేత్తలు.. విగ్రహానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు, కామ్డెన్ కౌన్సిల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గాంధీ లా చదివిన యూనివర్సిటీ కాలేజీకి సమీపంలో ఉన్న టవిస్టాక్ స్క్వేర్ లో 1968లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Next Story