అమెరికా హెచ్చరిక: రష్యాతో వ్యాపారం చేస్తే భారత్‌పై 500% సుంకం!

by Yella Dhawani Reddy |

రష్యాతో (Russia) వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలకు అమెరికా భారీ షాకిచ్చింది.

అమెరికా హెచ్చరిక: రష్యాతో వ్యాపారం చేస్తే భారత్‌పై 500% సుంకం!
X

దిశ, వెబ్ డెస్క్: రష్యాతో (Russia) వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలకు అమెరికా భారీ షాకిచ్చింది. 'Sanctioning Russia Act of 2025' (రష్యా నుంచి చమురు, వాయువు, యూరేనియం వంటి ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఇతర దేశాలపై, ముఖ్యంగా భారత్ (India), చైనా (China), ఇరాన్, యూరోపియన్ దేశాలు వంటి దేశాలపై 500 శాతం సుంకాన్ని విధించాలి) బిల్లును ప్రవేశపెట్టాడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donarld trump) ఆమోదం తెలిపారని యునైటెడ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ సెనేటర్ లిండ్సేగ్రాహామ్ తెలిపారు. ట్రంప్ మద్దతుతో ఆయన ఈ బిల్లును ఆగస్టులో యుఎస్ సెనేట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యూఎస్‌ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది.

కాగా, భారత్, చైనా లాంటి దేశాలు రష్యా చమురును 70% వరకూ దిగుమతి చేసుకుంటున్నాయనీ, ఇది రష్యాకు భారీ ఆర్థిక బలం కలిగిస్తున్నదనీ, దాన్ని అడ్డుకోవాలంటే అలాంటి గట్టివిధానాలు అవసరమని లిండ్సే స్పష్టం చేశారు. ఇక ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే, ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.

అయితే మరోవైపు ట్రంప్ భారత్‌తో త్వరలోనే తక్కువ సుంకాలతో ఓ ప్రత్యేక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని ప్రకటించారు. 'భారత్‌తో ఒక కొత్త ఒప్పందాన్ని సిద్ధం చేస్తున్నాం. వారు ఒప్పుకుంటే, దానితోపాటు తక్కువ సుంకాలు విధించే అవకాశం ఉంటుంది' అని ట్రంప్ చెప్పారు. జులై 9 నాటికి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం నుంచి భారత్‌కు వ్యత్యాసమైన దృక్పథం కనిపిస్తోంది. ఒకవైపు రష్యాతో ఉన్న సంబంధాలపై ఒత్తిడి పెరుగుతుంటే, మరోవైపు ద్వైపాక్షికంగా మిత్రత్వాన్ని బలోపేతం చేసేందుకు అవకాశాలు ఉండటం ఆసక్తికర పరిణామంగా మారింది.

Next Story