ఇరాన్‌తో యుద్ధం: ఇరాక్ తరహాలో సాగదు, త్వరలోనే ముగిస్తాం - అమెరికా రక్షణ మంత్రి

by Ramesh Naini |   (  Updated:2026-03-02 17:27:43  IST  )

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక ప్రకటన చేశారు.

ఇరాన్‌తో యుద్ధం: ఇరాక్ తరహాలో సాగదు, త్వరలోనే ముగిస్తాం - అమెరికా రక్షణ మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధం ఇరాక్ యుద్ధంలా ఏళ్ల తరబడి సాగదని, ఇది అత్యంత ‘నిర్ణయాత్మకమైన మిషన్’ అని, ట్రంప్‌ నాయకత్వంలో దీన్ని ముగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక పెంటగాన్‌లో నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను, నౌకా దళాన్ని పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు, ఆ దేశం వద్ద అణ్వాయుధాలు లేకుండా చేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం అని అన్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇరాన్ అమెరికాపై పరోక్ష యుద్ధం చేస్తోందని, హద్దులు దాటినందుకే ఇప్పుడు శిక్షిస్తున్నామని హెగ్సెత్ పేర్కొన్నారు.

ప్రజలకు సూచనలు

ఇది ప్రభుత్వం మార్పు కోసం చేస్తున్న యుద్ధం కాదని, అయితే ఇరాన్ ప్రజలు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అమెరికన్లను ఎక్కడైనా బెదిరించినా లేదా చంపినా వేటాడి మరీ అంతం చేస్తామని హెచ్చరించారు. అణు కార్యక్రమాన్ని ఆపేయాలని గతంలో చేసిన హెచ్చరికలను ఇరాన్ అహంకారంతో తిరస్కరించిందని, అందుకే ఈ నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు.

Next Story