మహిళలు ఒంటరిగా ఇండియాకు వెళ్లొద్దు.. అక్కడ రేప్‌లు ఎక్కువైపోయాయ్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

భారత్‌(India)పై మరోసారి అమెరికా(USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన అక్కసును వెళ్లగక్కారు.

మహిళలు ఒంటరిగా ఇండియాకు వెళ్లొద్దు.. అక్కడ రేప్‌లు ఎక్కువైపోయాయ్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌(India)పై మరోసారి అమెరికా(USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన అక్కసును వెళ్లగక్కారు. భారత సంస్కృతిని అవమానించేలా లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈనెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల విడుదల చేశారు. ఇండియాలో రేప్‌లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.. ఇండియాకు వెళ్లే మహిళలు, యువతులు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రకటనలో హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో అత్యాచారాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ముఖ్యంగా కొన్ని పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఒంటరిగా ప్రయాణించకూడదు. మహిళలైతే అసలు ఒక్కరే వెళ్లకూడదని ట్రంప్ స్పష్టం చేశారు.

అంతేకాడు.. భారత్‌లో పనిచేసే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా సంఘటనలు జరిగితే అత్యవసర సేవలు అందించే వెసులుబాటు అమెరికా ప్రభుత్వానికి లేనందున, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల జాబితాలో తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాలను అమెరికా చేర్చింది. జమ్మూ-కశ్మీర్, పాక్ సరిహద్దు, మధ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా రాజధానులకు వెళ్తే ఫరవాలేదని, గ్రామీణ ప్రాంతాలకు వద్దని అమెరికా పేర్కొన్నది. ట్వీట్

Next Story