‘మాకు భారత్‌తో చాలా తక్కువ అవసరం ఉంది’.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-01 18:01:23  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు.

‘మాకు భారత్‌తో చాలా తక్కువ అవసరం ఉంది’.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. భారత్‌తో మాకు ఉండే అవసరం చాలా తక్కువ.. మాతో భారత్‌కు ఉంటే అవసరం చాలా ఎక్కువ అని అన్నారు. ఇండియానే మాతో ఎక్కువగా వ్యాపారం చేస్తుందని పేర్కొన్నారు. భారత్‌ చాలాకాలంగా అమెరికాను తన పెద్ద కస్టమర్‌గా భావించిందని.. కానీ ప్రతిగా అమెరికాకు భారత్‌లో వ్యాపారం చేసేందుకు చాలా తక్కువ అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ అమెరికాకు భారీ మొత్తంలో వస్తువులను విక్రయిస్తుందని.. అమెరికన్‌ కంపెనీలు అక్కడ చాలా తక్కువ ఉత్పత్తులను విక్రయించగలవన్న ట్రంప్‌.. దీనికి భారత్‌ అధిక సుంకాలను విధిస్తుందంటూ ఆరోపించారు. తమపై ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటని.. అమెరికన్‌ ఉత్పత్తులు భారత మార్కెట్‌ను చేరుకోలేకపోవడానికి ఇదే కారణమని అన్నారు.

Next Story