ఇరాన్‌పై భీక‌ర‌ దాడులు.. వీడియో రిలీజ్ చేసిన అమెరికా

by velandi.Saikiran |

ఇరాన్ పైన దాడులకు సంబంధించి వీడియోను రిలీజ్ చేసింది అమెరికా. యుద్ధ నౌకల ద్వారా ఇరాన్ స్థావరాలపై దాడులు చేసింది.

ఇరాన్‌పై  భీక‌ర‌ దాడులు.. వీడియో రిలీజ్ చేసిన అమెరికా
X

దిశ‌, వెబ్ న్యూస్‌: ఇరాన్ వర్సెస్ అమెరికా-ఇజ్రాయెల్ మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. బలం ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ పైన దాడులకు సంబంధించి షాకింగ్ వీడియోను రిలీజ్ చేసింది అమెరికా. యుద్ధ నౌకల ద్వారా మిస్సైల్స్, ఫైటర్ జెట్స్ ప్రయోగించి ఇరాన్ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దృశ్యాలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఇరాన్ డ్రోన్లు ఉన్న స్థావరాలు, కీలక మిలటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఈ దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందుగా చెప్పినట్లు ఇరాన్ ముప్పు నుంచి అమెరికాను కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించింది. దీంతో తాజాగా అమెరికా విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.. తమపై దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్ తో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్మీ బేస్ క్యాంపు లపై కూడా దాడులకు దిగుతోంది. కొన్ని మిసైల్స్ అరబ్ దేశాల్లోని పలు ప్రాంతాలలో ప‌డ‌టంతో ప్రజలు గజగజ వణికి పోతున్నారు.

Next Story