- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మగ్లర్లపై అమెరికా సైన్యం దాడులు.. 14 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికా గత కొద్ది రోజులుగా.. మాదకద్రవ్య స్మగ్లర్ల పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే అమెరికా సైన్యం తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మరోసారి భారీ దాడులు జరిపింది.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా గత కొద్ది రోజులుగా.. మాదకద్రవ్య స్మగ్లర్ల (Drug smugglers) పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే అమెరికా సైన్యం తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మరోసారి భారీ దాడులు (Massive attacks) జరిపింది. ఈ దాడుల్లో నాలుగు మాదకద్రవ్య స్మగ్లింగ్ పడవలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో మొత్తం 14 మంది మృతి (14 people died) చెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని అమెరికా రక్షణ కార్యదర్శి (US Secretary of Defense) పీట్ హెగ్సేత్ తెలిపారు. ట్రంప్ పరిపాలనలో ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో, డ్రగ్ రవాణాకు పాల్పడినట్లు అనుమానం ఉన్న నౌకలపై వేగంగా దాడులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. రక్షణ చర్యల సమన్వయ బాధ్యతను మెక్సికో అధికారులు (Mexican authorities) స్వీకరించారు. సమాచారం ప్రకారం, సోమవారం జరిగిన మూడు వేర్వేరు దాడుల్లో ఒక దాడి ఒకేసారి రెండు పడవలను లక్ష్యంగా చేసుకుంది. ఈ తాజా దాడులతో సెప్టెంబర్ ప్రారంభం నుంచి అమెరికా చేపట్టిన ఆపరేషన్ల మొత్తం సంఖ్య 13కు చేరగా, ఇప్పటివరకు 14 పడవలు ధ్వంసమై 57 మంది మృతి చెందారు. గత వారం కరేబియన్ సముద్రంలో జరిగిన దాడుల తర్వాత ఇప్పుడు పసిఫిక్ సముద్రంలో చర్యలు ప్రారంభించడం ద్వారా అమెరికా సైన్యం తన యాంటీ డ్రగ్ ఆపరేషన్ పరిధిని విస్తరించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






