- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్మూజ్‌లో నౌకలపై డ్రోన్స్ ఎటాక్.. ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
ఇరాన్‌పై రెండోరోజూ అమెరికా దాడుల కలకలం.. చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడికి ప్రతీకారంగా విరుచుకుపడ్డ యూఎస్ వైమానిక దళం!

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు శాంతి చర్యల ఒప్పందం జరుగుతుండగా.. మరోవైపు మాత్రం ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా రెండోరోజూ ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం తీవ్ర చర్చకు దారీ తీసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, అంతర్జాతీయ ఒప్పందాలను కాలరాస్తున్న ఇరాన్‌పై అమెరికా తన సైనిక చర్యను మరింత తీవ్రం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Ceasefire Agreement) ఇరాన్ ఘోరంగా ఉల్లంఘించడమే కాకుండా.. అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు తెగబడటంతో అమెరికా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులతో (Air Strikes) విరుచుకుపడినట్లు ప్రకటించింది.
చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి
కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్తున్న ఒక అంతర్జాతీయ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ శనివారం రాత్రి సరికొత్తగా ఆత్మాహుతి డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ చేస్తున్న ఈ వరుస అరాచకాలకు ప్రతీకార చర్యగా (Retaliation) రంగంలోకి దిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్మూజ్ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్ భూభాగంలోని డ్రోన్ లాంచింగ్ ప్యాడ్‌లు, క్షిపణి కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలు భారీగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో (Middle East) ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.






