అర్ధరాత్రి గోదావరి తీరంలో క్షుద్రపూజలు.. కోళ్లు, మేకను బలిచ్చి వదిలేసిన ఆనవాళ్లు!

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక గ్రామం గోదావరి ఒడ్డు దగ్గర నిన్న(శనివారం) రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించారని గ్రామస్థులు చెబుతున్నారు.

అర్ధరాత్రి గోదావరి తీరంలో క్షుద్రపూజలు.. కోళ్లు, మేకను బలిచ్చి వదిలేసిన ఆనవాళ్లు!
X

దిశ, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక గ్రామం గోదావరి ఒడ్డు దగ్గర నిన్న(శనివారం) రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించారని గ్రామస్థులు చెబుతున్నారు. ఉదయం స్థానికులు కొందరు అటుగా వెళ్లగా గోదావరి ఒడ్డున ఇసుకలో ఒక గుండం గీసి చుట్టూ మేకులు కొట్టి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, నాలుగు కోళ్లు కోసి, ఒక మేకను కోసి ఆ గుండంలో వదిలేసి వెళ్లారని గ్రామస్తులు తెలిపిన సమాచారం. గోదావరి ఒడ్డున ఇలాంటి పూజలు చూడడం ఇదే మొదటి సారి అని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన పై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story