- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం.. జెట్ స్కీ చేస్తుండగా ఘటన
US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం.. జెట్ స్కీ చేస్తుండగా ఘటన
by Kema Shiva Kumar |
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలోని కాజీపేట ప్రాంతానికి చెందిన పి.వెంటకరమణ (27) ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఫ్లోరిడా రాష్ట్రంలోని ఇండియానా యూనివర్సిటీలో (ఐయూపీయూఐ)లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు మార్చి 9న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో విస్టీరియా ద్వీపం సమీపంలో జెట్ స్కీని నడుపుతుండగా వెంకటరమణను, 14 ఏళ్ల వయసు గల బాలుడు జెట్ స్కీతో అతడిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, ప్రమాదం నుంచి 14 ఏళ్ల బాలుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
Next Story






