- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొజ్తాబా ఆచూకీ చెబితే రూ. 93 కోట్ల బహుమానం.. అమెరికా భారీ ప్రకటన
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ లక్ష్యంగా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఆచూకీ తెలిపిన వారికి లేదా ఆయనకు సంబంధించిన కీలక సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 93 కోట్లు) భారీ ఆఫర్ ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీపై అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొజ్తాబా ఎక్కడు ఉన్నారో చెబితే వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.93 కోట్లు) ఇస్తామని యూఎస్ విదేశాంగశాఖ ప్రకటన చేసింది. మొజ్తాబాతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని సహా పలువురి పేర్లను యూఎస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఉగ్రవాదానికి వీరే కారణమని ఆరోపించింది. వీరు ఎక్కడున్నారో సమాచారం ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా తెలియజేయాలని కోరింది. ఇందుకు తగిన ప్రైజ్ మనీ అందిస్తామని తెలిపింది. పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి అమెరికాలో శాశ్వత నివాసం కల్పిస్తామని చెప్పింది.






