- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖతార్ పై ఇరాన్ దాడిని ఖండించిన సౌదీ అరేబియా.. వదిలిపెట్టబోమంటూ ఖతార్ వార్నింగ్
ఖతార్ లో ఉన్న యూఎస్ ఎయిర్ బేస్ (US Military base)పై ఇరాన్ మెరుపు దాడులతో విరుచుకు పడగా.. ఆ దాడిని సౌదీ అరేబియా (Saudi Arabia) తీవ్రంగా ఖండించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఖతార్ లో ఉన్న యూఎస్ ఎయిర్ బేస్ (US Military base)పై ఇరాన్ మెరుపు దాడులతో విరుచుకు పడగా.. ఆ దాడిని సౌదీ అరేబియా (Saudi Arabia) తీవ్రంగా ఖండించింది. పొరుగు దేశమైన ఖతార్ పై ఇరాన్ దూకుడుగా వ్యవహరించిందని సౌదీ విమర్శించింది. ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ తన దూకుడు చర్యలతో దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీస్తోందని సౌదీ మండిపడింది.
మరోవైపు ఖతార్ సైతం ఇరాన్ దాడులపై స్పందించింది. తమ దేశంలో ఉన్న ఎయిర్ బేస్ పై ఇరాన్ చేసిన దాడుల్ని ఖతార్ ఖండించింది. ఇరాన్ చేసిన ఈ దురాగతానికి బదులివ్వకుండా వదిలిపెట్టబోమని (Qatar Warns Iran) ఖతార్ తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకున్నామని వెల్లడించింది. అలాగే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఖతార్లోని అల్ ఉదీద్ లోని అమెరికా వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి ప్రకటించింది.






