- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1975 ఎమర్జెన్సీని ఖండిస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం
దేశంలో 1975 జూన్ 25 న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ జూన్ 25 బుధవారం కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో 1975 జూన్ 25 న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ జూన్ 25 బుధవారం కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం, మంత్రివర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఢిల్లీ క్యాబినెట్ మంత్రి పర్వేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశంలో మేము అత్యవసర పరిస్థితిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించామన్నారు. అదే సమయంలో అత్యవసర పరిస్థితిలో అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (MISA) కింద నిర్బంధించబడిన వ్యక్తులతో, మా NDMC వారి కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాట యోధులందరికీ గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించారు.
ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం
దేశంలో అత్యవసర పరిస్థితి ఒక చీకటి అధ్యాయం. దీనిని మనం ఎప్పటికీ మరచిపోలేము నేడు వారిని వ్యతిరేకించే వ్యక్తులను జైలులో పెట్టిన అదే పార్టీ మొత్తం రాజ్యాంగం కోసం ఏడుస్తుందని ఇది చాలా సిగ్గు చేటు అని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ చీకటి అధ్యాయంలో పడిన బాధలు, ఎమర్జెన్సీ సమయంలో తన ప్రయాణంపై ఓ పుస్తకాన్ని రాస్తున్నట్లు ప్రధాని తెలిపారు. భారతీయులెవరూ దీన్ని మరిచిపోరని ప్రధాని మోదీ అన్నారు. ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు.






