ఘోర ప్రమాదం.. కూలిన రైల్వే బ్రిడ్జి, 12 మంది మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-24 12:17:22  IST  )

నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఒక్కసారిగా నదిలో కూలిపోవడంతో 12 మంది మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు.

ఘోర ప్రమాదం.. కూలిన రైల్వే బ్రిడ్జి, 12 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మాణంలో ఉన్న భారీ రైల్వే వంతెన కుప్పకూలడంతో (Railway Bridge Collapsed) 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘోర ప్రమాదంలో చైనాలో జరిగింది. శుక్రవారం సిచువాన్ - కింగ్ హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా యెల్లో రివర్ (Yellow River)పై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. స్టీల్ కేబుల్ (Steel Cable) తెగిపోవడంతో బ్రిడ్జి కుప్పకూలినట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ప్రమాద సమయంలో ప్రాజెక్ట్ మేనేజర్ సహా 16 మంది అక్కడే ఉన్నారని, వారిలో 10 మంది స్పాట్ లో చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో టీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారని పేర్కొంది.

యెల్లో రివర్ చైనాలో అతిపెద్ద నదిగా పేరుగాంచింది. ఈ నదిపై నిర్మిస్తోన్న తొలి రైల్వే స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జి ఇదే. ప్రపంచంలోనే అతిపెద్ద స్పాన్ డబుల్ - ట్రాక్ స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జిగా కూడా ఈ బ్రిడ్జి గుర్తింపు పొందింది. ప్రధాన ఆర్చ్ ఒక్కసారిగా నదిలో కూలిపోవడం అక్కడున్న మిగతా సిబ్బందిని భయాందోళనకు గురిచేసింది. గల్లంతైన వారికోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story