ఎంతకైనా తెగిస్తాం.. ఉక్రెయిన్‌కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్

by Ajay Maddhiboyina |

రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పాలకులకు శాంతియుత మార్గంలో వివాదం పరిష్కరించుకోవడం ఇష్టం లేదని అన్నారు.

ఎంతకైనా తెగిస్తాం.. ఉక్రెయిన్‌కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పాలకులకు శాంతియుత మార్గంలో వివాదం పరిష్కరించుకోవడం ఇష్టం లేదని అన్నారు. ఒకవేళ దౌత్యం విఫలమైతే ప్రత్యేక సైనిక చర్య తప్పదని, లక్ష్యాలన్నింటినీ బలప్రయోగం ద్వారానే సాధిస్తామని అన్నారు. ఓవైపు పుతిన్ కామెంట్స్ చేస్తుంటే అదే సమయంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. రష్యా సుమారు 500 డ్రోన్లు, 40 క్షిపణులతో దాడు చేయగా ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. 27మందికి గాయాలు అయ్యాయి. ఇక ర‌ష్యా దాడుల‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ర‌ష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశం లేద‌నడానికి ఈ విధ్వంస‌మే నిద‌ర్శ‌నం అని పేర్కొన్నారు. నేడు యుద్ధం ముగింపు కోసం జెలెన్ స్కీ అమెరికా అధ్య‌క్షుడు పుతిన్ తో భేటీ కానున్నారు. ఫ్లోరిడాలో జ‌ర‌గ‌బోయే ఈ స‌మావేశంలో భ‌ద్రతా హామీల‌పై, వివాదాస్ప‌ద ప్రాంతాల‌పై చ‌ర్చిస్తారు.

Next Story