- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UK investigation: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై యూకే ఇన్వెస్టిగేషన్
అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమాన AI 171 ప్రమాద ఘటనపై యునైటెడ్ కింగ్ డమ్ తమ ఇన్వెస్టిగేషన్ టీంను ఇండియాకు పంపించనున్నట్లు ఆ దేశ ప్రధాని కీవ్ స్టార్మర్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమాన AI 171 ప్రమాద ఘటనపై యునైటెడ్ కింగ్ డమ్ తమ ఇన్వెస్టిగేషన్ టీంను ఇండియాకు పంపించనున్నట్లు ఆ దేశ ప్రధాని కీవ్ స్టార్మర్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోగా.. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుండగా బ్రిటన్‌కు చెందిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) బృందాన్ని పంపుతున్నట్లు స్టార్మర్ ప్రకటించారు. విమానం ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్పష్టత వచ్చే వరకు భారత అధికారులతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.
సమాచారం కోసం విదేశాంగ కార్యాలయం సంప్రదించండి..
బ్రిటన్ విదేశాంగ శాఖా కార్యదర్శి డేవిడ్ లామీ ఈ దర్యాప్తుకు నాయకత్వం వహిస్తారని ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాలు అవసరమైన సమాచారం కోసం విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ విమానంలో 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. ఈ విషాద ఘటనలో బాధితులందరి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. యూకేలోని డౌనింగ్ స్ట్రీట్ నుంచి విడుదలైన వీడియో సందేశంలో స్టార్మర్ మాట్లాడుతూ.. ప్రమాద స్థల దృశ్యాలు ‘విధ్వంసాన్ని’ సూచిస్తున్నాయన్నారు.






