ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. సహాయక చర్యలో హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

by Ramesh Naini |

ఫిలిప్పీన్స్‌ను కాల్మేగీ తుఫాను అతలాకుతలం చేసింది. మధ్య ఫిలిప్పీన్స్ అంతటా కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 26 మందికి పైగా మరణించారు.

ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. సహాయక చర్యలో హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిలిప్పీన్స్‌ను కాల్మేగీ తుఫాను అతలాకుతలం చేసింది. మధ్య ఫిలిప్పీన్స్ అంతటా కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 26 మందికి పైగా మరణించారు. తుఫాను కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం సోమవారం నాడు తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, బలమైన గాలులు పట్టణాలను ముంచెత్తింది. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లులు మునగడంతో చాలమంది ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. చిక్కుకున్న నివాసితులను తరలించడానికి రెస్క్యూ బృందాలు నిరంతరం పని చేస్తూనే ఉన్నాయి. అలాగే తాజాగా సహాయక చర్యల కోసం వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారి మృతి చెందినట్లుగా ఆ దేశ సాయుధ దళాలు ధృవీకరించాయి. ప్రస్తుతం వరదల్లో కార్లు కొట్టుకుపోతున్న వీడియోలు వైరలవుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు మరియు పరిస్థితులను తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ఫిలిప్పీన్ వైమానిక దళం (PAF) తెలిపింది.

Next Story