- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు భారత సంతతి శాస్త్రవేత్తలకు దక్షిణాఫ్రికా అత్యున్నత పౌర పురస్కారం
ప్రజారోగ్య రంగంలో విశేష సేవలందించి, అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందిన ఇద్దరు భారత సంతతి శాస్త్రవేత్తలకు దక్షిణాఫ్రికా అత్యున్నత పౌర పురస్కారం వరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజారోగ్య రంగంలో విశేష సేవలందించి, అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందిన ఇద్దరు భారత సంతతి శాస్త్రవేత్తలకు దక్షిణాఫ్రికా అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ సలీమ్ అబ్దూల్ కరీమ్, ప్రొఫెసర్ కీర్తన్ ధేడాలతో సహా మొత్తం 38 మందిని ఈ ఏడాది పురస్కారాలకు ఎంపిక చేశారు. మంగళవారం ప్రిటోరియాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా చేతుల మీదుగా వీరు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ మపుంగుబ్వే’ (Order of Mapungubwe) ను లాంఛనంగా అందుకున్నారు. దక్షిణాఫ్రికాతో పాటు యావత్ ప్రపంచ సమాజానికి ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా అసాధారణ విజయాలు సాధించిన, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దేశ పౌరులకు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేస్తారు. ప్రజారోగ్య విభాగంలో ఈ ఇద్దరు భారత సంతతి నిపుణులు చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవం దక్కడం గమనార్హం.






