Flash News: రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒకరు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-28 22:40:01  IST  )

అమెరికాలోని న్యూజెర్సీలో రెండు హెలికాప్టర్లు ఢీ కొన్నాయి.

Flash News: రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని న్యూజెర్సీలో రెండు హెలికాప్టర్లు ఢీ కొన్నాయి. హామన్ టన్లో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు అక్కడ వార్తా సంస్థలు వెల్లడించాయి. రెండు హెలికాప్టర్లు ఢీ కొనడంతో భారీఎత్తున మంటలు ఎగసి పడటంతో.. ఆ ప్రాంతం నుంచి దట్టమైన పొగ వెలువడింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఘటనా ప్రాంతంలో సహాయక దళాలు చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో ఒక హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమవ్వగా.. మరొకటి అటవీప్రాంతంలో కూలిపోయింది.

Next Story