అమెరికా నిఘా చీఫ్‌ తులసి గబ్బార్డ్ రాజీనామా

by velandi.Saikiran |

అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు.

అమెరికా నిఘా చీఫ్‌ తులసి గబ్బార్డ్ రాజీనామా
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఓ లేఖ‌ ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఆమె తెలియజేసినట్లు సమాచారం. ఈ మేరకు ఫాక్స్ న్యూస్ అధికారికంగా ప్రకటించింది. తన భర్త అబ్రహం విలియ‌మ్స్‌ అనారోగ్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకుందట తులసి గబ్బార్డ్. అత్యంత అరుదైన బోన్ క్యాన్సర్ తో అబ్రహం బాధపడుతున్నారని ఆమె లేఖలో వివరించారని సమాచారం అందుతోంది.

ఇలాంటి కష్టకాలంలో తన భర్తతో ఉండాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్, 2012లోనే హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ కు ఎంపిక అయ్యారు. ఆ తర్వాత అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ సమస్యల కారణంగా ఆమె త‌న బాధ్య‌త‌ల నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా రాజీనామా చేసిన తుల‌సి, జూన్ 30 వ‌ర‌కు ప‌ని చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత కొత్త అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ వ‌స్తార‌ని స‌మాచారం.

Next Story