Trump : ట్రంప్ హెచ్చరికలు.. ఇరాన్ కీలక నిర్ణయం

by Muthe.Rajitha |

ఇరాన్, ఇజ్రాయెల్(Iran vs Israel) ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు.

Trump : ట్రంప్ హెచ్చరికలు.. ఇరాన్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్, ఇజ్రాయెల్(Iran vs Israel) ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. అణు ఒప్పందం(Nuclear Deal)పై ఇరాన్ కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ఎన్నోసార్లు ఇరాన్ కు చెప్పామని, కాని వాటిని పట్టించుకున్నట్టు కనిపించలేదన్నారు. ఇజ్రాయెల్ దగ్గర భారీగా అధునాతన అణ్వాయుధాలు ఉన్నాయని, వాటి నుంచి ఇరాన్ తప్పించుకోలేదని అన్నారు. ఎప్పటికైనా ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం చేసుకోవాల్సిందేనని, లేదంటే సమస్య మరింత ముదురుతుందని హెచ్చరించారు.

ఇప్పటికే టాప్ లీడర్లను కోల్పోయిన ఇరాన్, యుద్ధాన్ని త్వరగా ముగించాలంటే అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో అణు చర్చలను రద్దు చేసుకుంది. చర్చల నుంచి వైదొలుగుతున్నట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని, అలాంటి దేశంతో చర్చలు గాని, ఒప్పందాలు గాని చేసుకోబోమని తేల్చి చెప్పింది.

Next Story