పరువు నష్టం దావా వేస్తా.. బీబీసీకి ట్రంప్ వార్నింగ్

by Ajay Maddhiboyina |

ప్రముఖ మీడియా సంస్థ బీబీసికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

పరువు నష్టం దావా వేస్తా.. బీబీసీకి ట్రంప్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మీడియా సంస్థ బీబీసికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగం మార్చినందుకు ఆ సంస్థపై 5 బిలియన్ డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ న్యాయ‌బృందం స‌దరు మీడియా సంస్థ‌కు లేఖ రాసింది. దీంతో క్ష‌మాప‌ణ‌లు చెప్పి బీబీసీ ఐదు బిలియ‌న్ డాల‌ర్లు ఇచ్చేందుకు నిరాక‌రించింది.

బీబీసీ క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ప్ప‌టికీ మ‌రోసారి ట్రంప్ ఆ సంస్థ‌పై దావా త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. వ‌చ్చే వారం బీబీసీపై 1 బిలియ‌న్ డాల‌ర్ల నుండి బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు కోర్టులో దావా వేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. దీని గురించి బ్రిట‌న్ ప్ర‌ధాని కీర్ స్టార్మ‌ర్ తో చ‌ర్చిస్తాన‌ని వెల్ల‌డించారు. ఇక ఇప్ప‌టికే ట్రంప్ రాజ‌కీయంగా ఒత్తిడి తీసుకురావ‌డంతో ప్ర‌భుత్వ నిధుల‌తో న‌డిచే బీబీసీకి ఆ సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ ట‌ర్నెస్ డెబోరా రాజీనామా చేశారు. అయిన‌ప్ప‌టికీ ట్రంప్ వ‌దిలిపెట్ట‌లేదు. త‌న ప్ర‌సంగం మార్చినందుకు దావా వేస్తాన‌ని మ‌రోసారి హెచ్చ‌రించారు.

Next Story