ఇకనైనా ఆ ప‌ని చేయండి..లేదంటే ప్రాణాలు పోతాయ్ !

by velandi.Saikiran |   (  Updated:2026-03-06 10:54:59  IST  )

ఇరాన్ దేశానికి మరో స్ట్రాంగ్ వార్నింగ్ పంపాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇకనైనా ఆయుధాలు వదలాలని కోరారు.

ఇకనైనా ఆ ప‌ని చేయండి..లేదంటే ప్రాణాలు పోతాయ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ దేశానికి మరో స్ట్రాంగ్ వార్నింగ్ పంపాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇకనైనా ఆయుధాలు వదలాలని కోరారు. ఇరాన్ లో ఉన్న సైన్యం, IRGC, పోలీసులు ఆయుధాలు వెంటనే వదిలేయాలని పిలుపునిచ్చారు ట్రంప్. ఇందులో భాగంగానే మరొక్క ఛాన్స్ ఇస్తున్నానని వెల్లడించారు. పోరాటంతో ప్రాణాలు పోవడం తప్ప.. ఏమి మిగలదని సూచించారు. ఇరాన్ ప్రజలకు సహకరించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ఇప్పుడు లొంగిపోతే ప్రాణాలకు ఎలాంటి హాని ఉండబోదని హామీ ఇచ్చారు ట్రంప్.

లేదంటే చావు తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇరాన్ దౌత్య వేత్తలు తమను శరణు కోరి నూతన నిర్మాణానికి సహకరించాలని ట్రంప్ కోరారు. అటు ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఎంపిక విషయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపిక‌ విషయంలో తాను ఇన్వాల్వ్ అవుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖ‌మేనీ కొడుకు మోజ్తాబా సుప్రీం లీడర్ అయ్యే అవకాశం ఉందని... దాన్ని అస్సలు అంగీకరించబోనని స్పష్టం చేశారు. శాంతి, సామరస్యం తీసుకువచ్చే వ్యక్తి ఇరాన్ సుప్రీం కావాలని వెల్లడించారు.

"మా నెక్స్ట్ టార్గెట్ క్యూబా" : ట్రంప్

Next Story