- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"మా నెక్స్ట్ టార్గెట్ క్యూబా" : ట్రంప్
ఇరాన్ తర్వాత తమ తదుపరి లక్ష్యం క్యూబా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. కాగా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్యూబా దేశంపై కీలక వ్యాఖ్యలు చేసారు. క్యూబా తమ జాతీయ భద్రతకు ఒక పెద్ద ముప్పుగా అభివర్ణించడం తీవ్ర చర్చకు దారితీసింది. క్యూబా ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని, ఆ దేశం తన పొరుగునే ఉంటూ శత్రు దేశాలకు సహకరిస్తోందన్న ఉద్దేశంతో.. మా తరువాత టార్గెట్ క్యూబా అని బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం తమ ప్రాధాన్యత ఇరాన్‌ను దారికి తెచ్చుకోవడమేనని స్పష్టం చేస్తూ.. "ముందు ఇరాన్ పని ముగించి.. ఆ తర్వాతే క్యూబా సంగతి చూస్తాం" అని ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం యొక్క దూకుడు స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే క్యూబాపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే విషయంలో మాత్రం ఆయన ఎటువంటి కాలపరిమితిని వెల్లడించకుండా సస్పెన్స్‌ను కొనసాగించారు.
మరోవైపు ఇరాన్ యుద్ధ రంగంలో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దళాలతో(IDF) కలిసి అమెరికా సైన్యం అత్యంత వ్యూహాత్మకమైన, మెరుపు దాడులను కొనసాగిస్తోందని ఆయన వెల్లడించారు. తాము అనుకున్న లక్ష్యాల కంటే వేగంగానే ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని, వరుస దాడుల వల్ల ఇరాన్ యొక్క రక్షణ సామర్థ్యం, ఎదురుదాడి చేసే శక్తి భారీగా క్షీణించిందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత మరియు క్షిపణి వ్యవస్థలతో కూడిన ఈ దాడుల వల్ల ఇరాన్ నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి యొక్క ఉమ్మడి వ్యూహమే ఇరాన్ పతనానికి కారణమవుతుందని ట్రంప్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ పరిణామాలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా, గల్ఫ్ ప్రాంతంలో, లాటిన్ అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో క్యూబా అప్రమత్తమవ్వగా, ఇరాన్ తన మిత్రదేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది.






