భారత్ - పాక్ అణుయుద్ధాన్ని ఆపకపోయుంటే ప్రధాని చనిపోయేవాడు : డొనాల్ట్ ట్రంప్ సంచలనం

by Naga Rani Yarlagadda |

భారత్ - పాక్ మధ్య తాను మధ్యవర్తిత్వం వహించకపోయి ఉంటే.. అణుయుద్ధం జరిగేదని ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ - పాక్ అణుయుద్ధాన్ని ఆపకపోయుంటే ప్రధాని చనిపోయేవాడు : డొనాల్ట్ ట్రంప్ సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా ఆపింది తానేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్ - పాకిస్థాన్ల మధ్య యుద్ధమేఘాలను తాను తొలగించానని, తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇరుదేశాల మధ్య పెద్ద యుద్ధం సంభవించేదన్నారు. ఈ యుద్ధం జరిగి ఉంటే కనీసం 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని, పాకిస్థాన్ ప్రధాని కూడా చనిపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు. తన దౌత్యంతోనే పెనుప్రమాదం తప్పిందని ట్రంప్ చెప్పడం సంచలనంగా మారింది. తొలి 10 నెలల కాలంలోనే 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు.

గతేడాది మే నెలలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే తాను రంగంలోకి దిగి.. గొడవలు ఆపకుంటే ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోనని ఇరుదేశాల నేతలకు తేల్చి చెప్పానన్నారు. యుద్ధం ఆపకుంటే 200 శాతం టారిఫ్ లు విధిస్తానని హెచ్చరించడంతో ఇరుదేశాలు శాంతించాయని వివరించారు. కొద్దినెలలుగా ట్రంప్ ఈ విషయాన్ని సుమారు 80 సార్లు ప్రస్తావించారు. తన మధ్యవర్తిత్వంతోనే భారత్ - పాక్ ల మధ్య యుద్ధం ఆగిందన్నారు. యుద్ధ విమానాలు కూల్చివేతపై కూడా భిన్నమైన గణాంకాలను చెబుతూ వస్తున్నారు. అయితే, ట్రంప్ వాదనలను భారత్ (న్యూఢిల్లీ) మొదటి నుంచీ తోసిపుచ్చుతూనే ఉంది. మే 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా భారత్-పాక్ దేశాల మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమేనని, ఇందులో మూడో పక్షం జోక్యం ఏమాత్రం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

Next Story