గాజాకు చివరి హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్

by Malleboina Mahesh |

శాంతి ప్రణాళికకు అంగీకరించకుంటే హమాస్ తీవ్ర పరిణామం ఎదుర్కొవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

గాజాకు చివరి హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, గాజాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హమాస్‌కు 20 సూచనలతో కూడి శాంతి ప్రణాళికను ట్రంప్ రూపొందించారు. ఈ శాంతి ప్రణాళిక (peace plan)కు అంగీకరించకుంటే హమాస్ తీవ్ర పరిణామం ఎదుర్కొవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తాజగా.. హమాస్ కు ట్రంప్ చివరి హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌ త్వరలో శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే, భారీ రక్తపాతం జరగవచ్చని హెచ్చరించారు. సోమవారం ఈజిప్టులోని కైరోలో జరగనున్న శాంతి చర్చలకు ముందు ట్రంప్ నుంచి వ్యాఖ్యలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు.

అలాగే ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas), ఇతర అరబ్ మధ్యవర్తుల మధ్య పరోక్ష చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తన ప్రతిపాదిత శాంతి ఒప్పందం యొక్క మొదటి దశ ఈ వారం పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో.. డొనాల్డ్ ట్రంప్ ఇలా రాశారు, "ఈ వారాంతంలో, మేము హమాస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో చాలా సానుకూల చర్చలు జరిపాము. ఈ చర్చలు చాలా విజయవంతమయ్యాయి. తుది వివరాలను రూపొందించడానికి, వాటిని స్పష్టం చేయడానికి సాంకేతిక బృందాలు సోమవారం ఈజిప్టులో మళ్ళీ సమావేశమవుతాయని ట్రంప్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story