- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ లొంగిపోవాల్సిందే.. వేరే ఆప్షన్ లేదు : ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ తమకు బేషరతుగా లొంగిపోవాలని, ఎలాంటి చర్చలు జరపబోమని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ తో డీల్ పై ట్రంప్ నిర్ణయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తో ఎలాంటి ఒప్పందం ఉండబోదని, ఆ దేశం బేషరతుగా లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలా చేస్తే.. ఇరాన్ ను సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కృషిచేస్తామన్నారు. ఇరాన్ ను గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఆర్థికంగా బలపరుస్తామని, మంచి భవిష్యత్ ఉంటుందంటూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ చేశారు.
వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇరాన్ ఇప్పటికే చర్చల కోసం వాషింగ్టన్‌ను సంప్రదించడం ప్రారంభించిందని, అయితే ఆ ప్రయత్నాలు చాలా ఆలస్యంగా మొదలయ్యాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను అమెరికా దాడులు నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన కొనియాడారు. ఈ సైనిక చర్యలు మరో నాలుగు నుండి ఐదు వారాల పాటు కొనసాగవచ్చని, పరిస్థితులను బట్టి ఈ గడువు మారవచ్చని ట్రంప్ సూచించారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికలో తనకు పాత్ర ఉండాలని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని వారసుడిగా తాను అంగీకరించబోనని ఆయన స్పష్టం చేశారు.
శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం: ఇరాన్ అధ్యక్షుడు
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. అమెరికా - ఇజ్రాయెల్‌తో ఘర్షణను ముగించడానికి కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయని తెలిపారు. ఇరాన్ ఎల్లప్పుడూ ప్రాంతీయ శాంతికి కట్టుబడి ఉంటుందని, అయితే తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలకు కారణమవుతున్న వారికి ధీటుగా సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు.






