నా పాలనలో అమెరికన్లు చాలా సంతోషంగా ఉన్నారు: Donald Trump

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-21 14:24:16  IST  )

దావోస్ లో జరిగిన‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. గతంలోనూ ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనగా మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నా పాలనలో అమెరికన్లు చాలా సంతోషంగా ఉన్నారు: Donald Trump
X

దిశ, వెబ్ డెస్క్: దావోస్ లో జరిగిన‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. గతంలోనూ ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనగా మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికాకు 200 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. తన పాలనలో అమెరికన్లు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. గత ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డు సృష్టించాయని అన్నారు.

అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించామని, అమెరికా అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. వెనెజులా 20ఏళ్ల క్రితం గొప్ప దేశం అని కానీ ఆ త‌ర‌వాత ప‌రిస్థితులు దిగ‌జారిపోయాయ‌ని అన్నారు. వెనెజులా అధ్య‌క్షుడు మ‌దురోను అదుపులోకి తీసుకున్న‌త‌రవాత ఆ దేశం ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వ‌చ్చింద‌న్నారు. అమెరికా ప్ర‌పంచంలోని 40శాతం దేశాల‌తో వాణిజ్య ఒప్పందాల‌ను క‌లిగి ఉంద‌న్నారు. దేశాల‌పై విధిస్తున్న సుంకాల కార‌ణంగా అమెరికాలో పెరుగుతున్న వాణిజ్య లోటు త‌గ్గుతోంద‌ని చెప్పారు. తాను యూరప్ ను ప్రేమిస్తున్నాన‌ని కానీ ఆ దేశం స‌రైన దిశ‌లో ప్ర‌యాణించ‌డంలేద‌న్నారు.

Next Story