- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రాగన్ కంట్రీకి మరో షాక్ ఇచ్చిన ట్రంప్.. అదనంగా 100శాతం సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీ చైనాకు మరో షాక్ ఇచ్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 1 నుండి ఈ టారిఫ్ లు అమలులోకి వస్తున్నట్టు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీ చైనాకు మరో షాక్ ఇచ్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 1 నుండి ఈ టారిఫ్ లు అమలులోకి వస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటనకు కొన్ని గంటల ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ మండిపడ్డారు. జిన్ పింగ్ తో భేటీకి కారణం కనిపించడం లేదని, భేటీని రద్దు చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
చైనా నిర్ణయానికి ప్రతిచర్యగా భారీ సుంకాలు తప్పవని అన్నారు. తాజా పరిణామాలపై చైనా దూకుడుగా ముందుకెళ్తే సుంకాల మోత ఈ నెలలోనే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఇక ఇప్పటికే చైనాపై ట్రంప్ 30 శాతం సుంకాలు విధించగా ఇప్పుడు 100శాతానికి పెంచడం సంచలనంగా మారింది. మరో రెండు వారాల్లో దక్షిణకొరియా పర్యటనలో ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ కానున్నారు. ఈ భేటీకి ముందు సుంకాలు విధించడం, ఆ దేశానికి వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.






