విజయ్ ప్రమాణస్వీకారానికి త్రిష.. వీర లెవల్‌లో ఎంట్రీ.. నెట్టింట వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-10 04:15:29  IST  )

తమిళనాడు సీఎంగా నేడు దళపతి విజయ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.

విజయ్ ప్రమాణస్వీకారానికి త్రిష.. వీర లెవల్‌లో ఎంట్రీ.. నెట్టింట వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎంగా నేడు దళపతి విజయ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే విజయ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అక్కడుకు చేరుకున్నారు. విజయ్ ఇన్ షట్ తో క్లీన్ లుక్‌లో స్టేడియం వద్దకు వచ్చారు. ఇక హీరోయిన్ త్రిష కూడా నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు. త్రిష తన తల్లితో కలిసి ఇంటి వద్ద నుండి బయలుదేరి స్టేడియంకు వెళ్లారు.


అంతే కాకుండా బ్లూకర్ చీర, తలలో మల్లెపూలు పెట్టుకుని త్రిష ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవల విజయ్ గెలిచిన సమయంలోనూ త్రిష హుటాహుటిన అతడి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. విజయ్ ఇంటికి వద్దకు వెళ్లిన తరవాత మీడియాకు ముఖం చాటేసిన త్రిష విక్టరీ సింబల్ మాత్రం చూపించారు.




ఇదిలా ఉంటే చాలా కాలం నుండి విజయ్, త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. విజయ్ భార్య సంగీత అతడికి వాడాకుల నోటీసులు పంపడంతో వీరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నోటీసుల్లో విజయ్ తమతో రెండేళ్లుగా ఉండటం లేదని, ఓ హీరోయిన్ తోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. ఆ తరవాత విజయ్ రిలేషన్ షిప్ లో ఉన్న నటి త్రిషనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక తరవాత ఓ ఫంక్షన్ కు విజయ్, త్రిష కలిసి వెళ్లడంతో దానిపై క్లారిటీ కూడా వచ్చేసింది.

Next Story