కాలిఫోర్నియాలో భారత విద్యార్థి మిస్సింగ్ ఘటన విషాదాంతం

by Ajay Maddhiboyina |

ఈ నెల 9న కాలిఫోర్నియాలో 22ఏళ్ల భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మిస్ అయిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మిస్సింగ్ ఘటన విషాదాంతమైంది. సాకేత్ మృతి చెందిన‌ట్టు శాన్ ఫ్రాన్సిస్కోలోని భార‌త కాన్సులేట్ ఆదివారం తెలియ‌జేసింది.

కాలిఫోర్నియాలో భారత విద్యార్థి మిస్సింగ్ ఘటన విషాదాంతం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 9న కాలిఫోర్నియాలో 22ఏళ్ల భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మిస్ అయిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మిస్సింగ్ ఘటన విషాదాంతమైంది. సాకేత్ మృతి చెందిన‌ట్టు శాన్ ఫ్రాన్సిస్కోలోని భార‌త కాన్సులేట్ ఆదివారం తెలియ‌జేసింది. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసింది. త‌ప్పిపోయిన భార‌తీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాస‌య్య డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకు విచారం వ్య‌క్తం చేస్తున్నాం. వారి కుటుంబానికి ఆనుభూతి తెలియ‌జేస్తున్నాం.. అంటూ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే స్థానిక మీడియా నివేదికల ప్ర‌కారం సాకేత్ క‌నిపించకుండా పోయేముందు సాన్ ఫ్రాన్సిస్కోలోని బ‌ర్కిలీ కొండ‌ల వ‌ద్ద లేక్ అంజా స‌మీపంలో చివ‌రిసారిగా క‌నిపించాడు. అత‌డి పాస్ పోర్ట్, ల్యాప్ టాప్ ఉన్న బ్యాగు దానికి స‌మీపంలోని ఓ ఇంటి గుమ్మం పై క‌నిపించ‌గా డెడ్ బాడీని సమీపంలో గుర్తించారు. ఇదిలా ఉంటే కర్ణాటకకు చెందిన సాకేత్ ఐఐటీ మద్రాస్ లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం బర్కిలీలో అతడు కెమికల్ మరియు బయోమాలిక్యూలార్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు మరణించడంతో కుటుంబంలో విషాదం నిండుకుంది.

Next Story