Manali adventure:మనాలి అడ్వెంచర్ లో విషాదం.. 30 అడుగుల లోయలో పడ్డ బాలిక

by Shamantha N |   (  Updated:2025-06-15 09:24:15  IST  )

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో నాగపూర్ కు చెందిన ఓ కుటుంబం విహారయాత్రకు రాగా అది విషాదంగా మారింది

Manali adventure:మనాలి అడ్వెంచర్ లో విషాదం.. 30 అడుగుల లోయలో పడ్డ బాలిక
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో నాగపూర్ కు చెందిన ఓ కుటుంబం విహారయాత్రకు రాగా అది విషాదంగా మారింది. నాగ్‌పూర్ నివాసితులు ప్రఫుల్ల బిజ్వే, అతని భార్య, కుమార్తె త్రిష బిజ్వే మనాలి అందాలు వీక్షేందుకు వచ్చారు. జూన్ 8న జిప్ లైన్ కేబుల్ ద్వారా అటు వైపు నుంచి ఇటు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో త్రిష బజ్వే (10) మధ్యలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా పడిపోయింది. జిప్ లైన్ ఊడిపోయి 30 అడుగుల లోయలో త్రిష పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వీడియోలో జిప్ లైన్ ఊడిపోవడంతోనే పడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

జిప్ లైన్ ఆపరేటర్ల వైఫల్యం

వేసవి సెలవుల సందర్భంగా కుటుంబం మనాలికి వచ్చింది. టూరిస్ట్ జిప్‌లైన్ వద్ద అడ్వంచర్ చేస్తుంటారు. కాగా ఈ స్థలంలో తగిన భద్రతా చర్యలు లేవని ప్రమాదం తర్వాత వారికి తక్షణ సహాయం అందలేదని తెలుస్తోంది. త్రిషకు మనాలిలో ప్రాథమిక చికిత్స అందించగా.. తర్వాత చండీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిజ్వే కుటుంబం ఈ సంఘటన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జిప్‌లైన్ ఆపరేటర్ల నుంచి ఈ ఘటనకు సంబంధించి సమాధానం కావాలని కోరుకుంటున్నామని, అడ్వెంచర్ టూరిజం సైట్‌లలో మెరుగైన భద్రతా విధానాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. టూరిజం కోసం వస్తే ఇలా ప్రాణాలు పోగోట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా అని ప్రశ్నించారు.

Next Story