ముదిరిన ట్రేడ్ వార్.. చైనాపై అమెరికా సుంకాల మోత

by D.Reddy |
ముదిరిన ట్రేడ్ వార్.. చైనాపై అమెరికా సుంకాల మోత
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America), చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం (Tariff War) మరింత తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే డ్రాగన్‌ దేశంపై అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) సుంకాల మోత మోగిస్తుండగా.. తాజాగా మరోసారి టారిఫులు పెంచుతున్నట్లు ప్రకటించారు. వారం రోజుల క్రితమే డాలరు కంట్రీ చైనా దిగుమతులపై ఏకంగా 145 శాతానికి సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని విధించి చైనా ప్రతీకారం తీర్చుకుంది. ఈ పరిణామానికి చైనాకు అమెరికా గట్టిగా బదులిచ్చింది. 145 శాతంగా ఉన్న సుంకాలను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. పరస్పర సుంకాల పెంపుతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరినట్లైంది.

ఇక ఇంతగా సుంకాలు పెంచినా.. తాము భయపడమని చైనా ఇప్పటికే కుండబద్దలు కొట్టింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాము ముందుకెళ్లి పోరాడతామని.. అంతేకానీ వెనక్కి మాత్రం తగ్గమని ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు, అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో, తమకు మద్దతుగా నిలవాలని భారత్‌, సహా పలుదేశాలను చైనా కోరింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ పౌరులకు వీసాలను జారీ చేస్తోంది. 2025 జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 మధ్య దాదాపు 85,000 కంటే ఎక్కువ వీసాలను జారీ చేసింది. ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలను మరింత పెంపొందించడానికి చైనా చేస్తున్న ప్రయత్నంగా దీనిని చెప్పుకోవచ్చు.

Next Story

Most Viewed