- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిమచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు.. ఐదుగురు మృతి
హిమచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: హిమచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు. అందులో ముగ్గురు డెడ్ బాడీలను కాంగ్రా జిల్లాలో వెలికితీశారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టులో పని చేస్తున్న 10 మంది కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రాతో పాటు, కులు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. కేంద్ర, రాష్ట్ర రెస్య్కూ బృందాలు 250 మందికి పైగా ప్రజలను రక్షించినట్లు ఆఫీసర్లు తెలిపారు. కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్ షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ఆకస్మికంగా వరదలు రావడంతో చాలా మంది కొట్టుకుపోయారని చెప్పారు. సహాయక చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. (SDRF) స్థానిక పోలీసులు హిమాచల్ ప్రదేశ్ హోమ్ గార్డ్ వాలంటీర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 250 మందిని సురక్షితంగా రక్షించారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ రాష్ట్రంలోని కమిషనర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మిస్సింగ్ అయిన వ్యక్తుల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) జూన్ 25 నుంచి జులై 1 మధ్య హిమాచల్ ప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ 29న రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉనా, బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, చంబా, కులు, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకస్మిక వరదలు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.






