- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లా కాలేజీ స్టూడెంట్ పై లైంగిక దాడిపై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్‌కతా లా కాలేజీ లో జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా లా కాలేజీ లో జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఒక స్నేహితుడు మరో స్నేహితురాలిపై అత్యాచారం చేస్తే ఏమీ చేయలేమని ఆయన అన్నారు. పోలీసులు కాలేజీలు, స్కూళ్లలో ఉంటారా? ఆమెను ఎవరూ రక్షిస్తారు అని కాంట్రావర్సీ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ లోని ప్రతిపక్ష పార్టీ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కాగా కేసులో ప్రధాన నిందితుడు టీఎంసీ పార్టీకి చెందిన వ్యక్తి అని విలేకరులు ఆయన్ను ప్రశ్నించగా.. ఎవరు ఇలాంటి పనులు చేసినా వెంటనే అరెస్టు చేయాలి. అలాంటి వారిపై మహిళలు పోరాటం చేయాల్సిందేనని కల్యాణ్ బెనర్జీ అన్నారు.
టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
జూన్ 25 బుధవారం కోల్ కతా లోని లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. జూన్ 26 ఆ విద్యార్థి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులు(31) ఏళ్ల మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్ (19) ప్రమిత్ ముఖోపాధ్యాయ (20) గా గుర్తించారు. మిశ్రా పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. టీఎంసీ అనేక కార్యక్రమాల్లో మిశ్రా పాల్గొన్నడని బీజేపీ ఆరోపిస్తుంది. ఆర్జీకర్ హాస్పిటల్ హత్యాచార ఘటన మరవకముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పశ్చిమ బెంగాల్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఇప్పటికే బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.






