- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పునర్జన్మ పై టిబెట్ బౌద్ద గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు
పునర్జన్మ (Reincarnation) పై ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా (famous Buddhist guru Dalai Lama) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పునర్జన్మ (Reincarnation) పై ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా (famous Buddhist guru Dalai Lama) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వారసుడి (successor) పుట్టుకపై బౌద్ధ గురువు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్ (Voice for the Voiceless) పుస్తకంలో పునర్జన్మపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. నా వారసుడు చైనా బయట జన్మిస్తాడని, తన తర్వాత పరంపర ముగిసి పొవచ్చని కూడా వ్యాఖ్యానించాడు. అంతేగాక నా పునర్జన్మ భారత్(India) లేదా టిబెట్ (Tibet) లో జరగొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో బౌద్ధ గురువు చేసిన వ్యాఖ్యలు బుద్ధుని ఆరాధకుల మధ్య చర్చనీయాంశం అయ్యాయి.
గతంలో తాను 110 ఏళ్లు జీవిస్తానని చెప్పిన దలైలామా.. ఓ పుస్తకంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ పుస్తకంలో ఇంకేం చెప్పారోనని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. కాగా టిబెట్ బౌద్ధ గురువు దలైలామాలు బౌద్ధ సన్యాసి అవలోకితేశ్వర (Buddhist monk Avalokiteshvara) యొక్క పునర్జన్మ అని నమ్ముతారు. వీరు శాంతి, అహింస, బుద్ధుని బోధనలను బోధిస్తుంటారు. దలైలామాలు అంటే జ్ఞానోదయం పొందిన జీవులు అని బౌద్ధులు విశ్వసిస్తారు. ప్రస్తుతం ఉన్న దలైలామా 14 వ బౌద్ధ గురువు. ఈయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఆరాధ్య గురవు. దలైలామా టిబెట్ స్వాతంత్యం (independence of Tibet) కోసం అహింసాయుతంగా పోరాడుతున్నారు.






