- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయెల్‌లో కలకలం..ఒకే చోటకు వేలాది కాకులు..కారణం ఇదే?
యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు వేలాది సంఖ్యలో కాకులు వచ్చిన వీడియో సోషల్ మీడియా షేక్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య మొన్నటి వరకు యుద్ధం జరగగా, కోట్లాది నష్టం జరిగింది. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో కాస్త వెనకకు తగ్గిన ట్రంప్, తాత్కాలిక విరామం ప్రకటించారు. అటు ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. ఐదు కండీషన్లకు ఒప్పుకుంటేనే, తాము యుద్ధం ఆపేస్తామని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో వేలాది కాకులు కలకలం రేపాయి. యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు వేలాది సంఖ్యలో కాకులు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా షేక్ చేస్తోంది. ఆకాశంలో ఎటు చూసినా ఈ కాకులే కనిపిస్తున్నాయి.
వినాశనానికే సంకేతమా ?
అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ వినాశనానికి సంకేతం అని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదేం వినాశనం కాదని, ఇలాంటి సంఘటనలు సాధారణంగా జరుగుతూ ఉంటాయని మరికొంతమంది స్పష్టం చేస్తున్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వలసల సమయంలో 50 కోట్ల పక్షులు ఇజ్రాయెల్ గుండా కాకులు, ఇతర పక్షులు ప్రయాణిస్తాయని అటు శాస్త్రవేత్తలు కూడా పేర్కొంటున్నారు. గూడు కట్టే కాలంలో హుడెడ్ కాకులు పట్టణాలలో గుంపులుగా చేరుతాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ కాకుల విహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.






