ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుతో తలదించుకునే రోజులు వస్తాయ్: అమిత్ షా

by Shamantha N |

తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాల్లో భాషా వివాదాలు చెలరేగుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుతో తలదించుకునే రోజులు వస్తాయ్: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాల్లో భాషా వివాదాలు చెలరేగుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారికి త్వరలో సిగ్గు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ స్వభావానికి, ఔన్నత్యానికి స్థానిక భాషలే కేంద్రబిందువుగా ఉండాలని, విదేశీ భాషల కంటే అవే ప్రాధాన్యంగా ఉండాలన్నారు. దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారికి త్వరలో సిగ్గు పడే రోజులు వస్తాయి. మన దేశ భాషలు మన సంస్కృతికి ఆభరణాల లాంటివి అన్నారు. మన భాషలు లేకపోతే మనం నిజమైన భారతీయులం కాదు అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

భారత్, సంస్కృతి, సంప్రదాయాలకు స్వదేశీ భాషలే మూలం

భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొందేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భాషల్లో మాట్లాడేందుకు, వృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌ను వలస చిహ్నంగా భావించే రోజులు త్వరలో రానున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ లో సంస్కృతి, చరిత్ర అర్థం చేసుకోవడానికి విదేశీ భాష సరిపోదన్నారు. అర్ధంకాని విదేశీ భాషల ద్వారా సంపూర్ణ భారత్‌ను ఊహించలేం అని షా స్పష్టం చేశారు. ఈ పోరాటం ఎంత కఠినమైనదో బాగా తెలుసు. కానీ భారతీయ సమాజం గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. మళ్ళీ ఆత్మగౌరవంతో, మన స్వభాషల్లో మెరుగుపడి దేశాన్ని నడిపిస్తూనే ప్రపంచానికి నాయకత్వం వహిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని అమలు పరచడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దక్షిణాధి రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. హిందీని దక్షిణ భారతంలో కావాలనే రుద్దాలని ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.

స్థానిక భాషల్లో కమ్యూనికేషన్ కు కృషి

కేంద్రం హిందీని ప్రోత్సహించేందుకు త్రిభాషా విధానాన్ని ప్రోత్సహిస్తున్నాందని పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో, ఈ ఏడాది మొదట్లో అమిత్ షా మాట్లాడుతూ.. డిసెంబర్ నుంచి హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో వారి స్థానిక భాషల్లోనే కమ్యూనికేషన్ జరిపే విధానాన్ని అమలు చేస్తుందని ప్రకటించారు. భాష ఆధారంగా దేశంలో ఇప్పటివరకూ ఎన్నో విభేదాలు జరిగాయని, ఇకపై అలాంటివి జరగకూడదని ఆయన పేర్కొన్నారు.

Next Story