సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదు: అమిత్ షా

by Shamantha N |

సింధు నది జలాల ఒప్పందం పునరుద్ధించే విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదు: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: సింధు నది జలాల ఒప్పందం పునరుద్ధించే విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించిందని ఇక నీటి కొరతతో అల్లాడాల్సిందేనని అన్నారు. అమిత్ షా ఈ ఒప్పందం (Indus Water Treaty) నిలిపివేత గురించి జాతీయ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చర్చించారు. సింధూ నది జలాలను నిలిపివేసే హక్కు భారత్ కు ఉంది. ఏక పక్షంగా రద్దు చేయలేం. కానీ ఒప్పందం సరిగా పాటించకుండా ఉల్లంఘించిన పాక్ కు భారత్ నీటిని నిలిపివేసే హక్కు ఉందని తెలియజేస్తోంది. భారత్ కు హక్కుగా వచ్చిన నీటిని కచ్చితంగా ఉపయోగించుకుంటాం. సింధు నదిపై మరో కెనాల్ నిర్మించి పాకిస్థాన్ కు నీళ్లు వెళ్లకుండా రాజస్థాన్ కు తరలిస్తామని చెప్పారు. దీంతో ఆ దేశం గొంతు ఎండుతుందని స్పష్టం చేశారు.

80 శాతం సింధు నది నీటితోనే.. పాక్ లో పంటలు

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం నిలిపివేత గురించి పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఒత్తిడి తెస్తోంది. పాక్ లో వ్యవసాయానికి 80 శాతం సింధు నది నుంచి వెళ్లిన నీటిని వాడుకుంటారు. పాకిస్థాన్‌ జీడీపీలో 25 శాతం ఈ నదుల నుంచే లభిస్తోంది. దీంతో ఈ వర్షాకాలంలో పాకిస్థాన్ లో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఒక వేళ నీటిని ఆపితే పాకిస్థాన్ మళ్లీ దాడులకు తెగబడే అవకాశం ఉందా? భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

Next Story