- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లీష్ ను పేద విద్యార్థులకు దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది: రాహుల్ గాంధీ
ప్రపంచంతో పోటీ పడే విద్యార్థులకు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఎంతో అవసరమని రాహుల్ గాంధీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంతో పోటీ పడే విద్యార్థులకు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఎంతో అవసరమని రాహుల్ గాంధీ అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అనేక రకాలుగా ఉపయోగపడుతుందని, విద్యార్థుల విజయాల్లో సహకరిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ రావడం ఎంతో ముఖ్యమన్నారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ భాష ఎంతో అవసరమన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల స్టూడెంట్ ఆత్మవిశ్వాసం, ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇష్టం లేదని అన్నారు. ఇంగ్లీష్ ప్రపంచ స్థాయి భాష అని దీన్ని పేద విద్యార్థులకు దూరం చేయాలని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఉన్న భాషలను గౌరవిస్తూనే ఇంగ్లీష్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.
అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దుమారం
ఈ మధ్య జరిగిన ఒక ప్రోగ్రాంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలో ఇంగ్లీష్ లో మాట్లాడేవారు సిగ్గుపడాల్సిన రోజు వస్తుందన్నారు. విదేశీ భాషల వల్ల భారతీయత పెరగదని స్పష్టం చేశారు. మన దేశం, మన సంస్కృతిని అర్థం చేసుకునేందుకు పరాయి భాషలు సరిపోవని అన్నారు. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు రాష్ట్రం తీవ్రంగా విభేదిస్తోంది. ఈ సందర్భంగా అమిత్ షా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ ను విడిచిపెట్టడం అంత సులభం కాదని, అయినా మనం దాని నుంచి బయట పడే రోజులు వస్తాయని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని దాన్ని దూరం చేసుకోవడం అంటే మూర్ఖత్వమే అని పేర్కొన్నారు.






