- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచంలో అందరికంటే ముందు న్యూఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే.. గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ప్రజలు
ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరగవు. మరి కొత్త సంవత్సరం ఎక్కడ ముందుగా ప్రారంభమైందో, ఎక్కడ ముగుస్తుందో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది గంటల్లో 2025కు వీడ్కోలు పలికి.. 2026కు స్వాగతం చెప్పేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. గడియారంలో ముల్లు 12 గంటలను తాకడమే ఆలస్యం.. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. అయితే.. భూ భ్రమణం, వేర్వేరు టైమ్ జోన్ల కారణంగా న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరగవన్న విషయం మనకు తెలుసు. మరి కొత్త సంవత్సరం ఎక్కడ ముందుగా ప్రారంభం కానుందో, ఎక్కడ ముగుస్తుందో తెలుసా?
కిరిబాటి దేశంలోని కిరితిమలి ఐలాండ్ న్యూ ఇయర్ కు ముందుగా స్వాగతం పలికింది. కిరితిమలి టైమ్ జోన్ కు మనకు.. ఎనిమిదిన్నర గంటలకు పైగానే సమయం తేడా ఉంది. ఈ ఐలాండ్ ను క్రిస్మస్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ డేట్ లైన్ కు దిగువన.. పశ్చిమాన ఈ ఐలాండ్ ఉండటంతో అందరికంటే ముందుగా ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై జరిగే భారీ బాణసంచా వెలుగులతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాయి. ఈ దేశాల తర్వాత జపాన్, దక్షిణ కొరియా, చైనా, ఆగ్నేయ ఆసియా దేశాలను న్యూ ఇయర్ పలుకరించనుంది. వీటన్నింటి తర్వాత భారత్ లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి.
గ్లోబల్ కౌంట్ డౌన్ లో మనం మధ్యస్థంగా ఉన్నాం. మన తర్వాత పశ్చిమ ఆసియా, యూరప్ దేశాల్లో వేడుకలు ప్రారంభమవుతాయి. లండన్లోని బిగ్ బెన్, పారిస్ లోని ఈఫిల్ టవర్, బెర్లిన్ లో జరిగే వేడుకలు హైలైట్ గా నిలవనున్నాయి. వీటి తర్వాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, బ్రెజిల్ బీచ్ లలో కొత్త సంవత్సర వేడుకలు మొదలుకానున్నాయి. ప్రపంచంలో అందరికంటే చివరిగా న్యూ ఇయర్ జరుపుకునేది అమెరికన్ సమోవా, బేకర్, హౌలాండ్ దీవులు. కిరిబాటి కంటే ఈ దేశాల్లో సమయం 24 గంటలు ఆలస్యంగా ఉంటుంది. అందుకే నూతన సంవత్సర వేడుకలు చాలా ఆలస్యంగా ప్రారంభమవుతాయి.






