ట్రంప్‌కు గుడి.. ప్రపంచవ్యాప్తంగా చర్చ..

by Sujitha Rachapalli |

తెలంగాణలో డోనాల్డ్ ట్రంప్‌కు గుడి భారత వస్తువులపై అమెరికా సుంకం క్రమంలో చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న డిస్కషన్

ట్రంప్‌కు గుడి.. ప్రపంచవ్యాప్తంగా చర్చ..
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై సుంకం విధించడం చర్చనీయాంశమైంది. ఇండియా విషయంలో అమెరికా వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఇండియన్ ట్రంప్‌కు గుడి కట్టిన అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇలాంటి వ్యక్తికి ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడమేంటనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంతకీ ఈ గుడిని ఎవరు నిర్మించారు? ఎక్కడ, ఎందుకు కట్టించారు? అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.

అసలు కథ.. ??

తెలంగాణ.. జనగాం.. కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ.. ట్రంప్ ఉదయం కలలోకి వచ్చిన ప్రతిసారి పాజిటివ్ వైబ్స్ రావడం గుర్తించాడు. ఆయననే తన దేవుడిగా పరిగణిస్తూ పూజలు చేశాడు. ఆ తర్వాత ఆరడుగుల విగ్రహాన్ని నిర్మించాడు. గుడి కట్టి.. అభిషేకాలు, అర్చనలు చేశాడు. ఇదంతా 2019 కథ. కాగా 2020లో ట్రంప్ కొవిడ్‌తో బాధపడుతున్నాడని తెలిసి.. ఉపవాసం చేశాడు. ఈ క్రమంలోనే చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కట్టిన గుడిలో గ్రామస్తులు పూజలు చేయడం కొనసాగించారు.

Next Story